Importance of the Tirumala deity
ఆలయ విశిష్టత
ఇక్కడి స్వామికి ఆపద మొక్కుల వాడు అని పేరు.ఏదయినా కోరిక నెరవేరాలంటే స్వామివారికి సమర్పించడం కోసం ముడుపు కట్టుకుని ఆ కోరిక తీరగానె స్వామిని దర్శనం చేసుకుని ఆ ముడుపు కట్టిన దాన్ని స్వామికి సమర్పించడం ఆనవాయితీ.
Lord Venkateswara |
శ్రీవారి దివ్యమంగలవిగ్రహం ఎత్తు 9.2 అడుగులు.శిలాతోరణద్వారం ఎత్తూ ఈ ఎత్తూ సమానం - అంటే ఈ మూర్తి అలా నడుచుకుంటూ శిలాతోరణాన్ని దాటితే వంగనక్కరలేదు,తల మీద ఖాళీ ఉండదు.విగ్రహం మెద ఉలి చెక్కడపు ఆనవాళ్లు కనపడవు - ఒక మనిషి తనకు తానే శిలారూపం దాల్చినంత జీవకళ కనపడుతుంది ఆ మూర్తిలో!అసలు శిల్పులు అర్చామూర్తులని చెక్కదానికి సంబంధించిన ఆగమశాస్త్రనియమాలు ఈ మూర్తికి వర్తించవు.ఈ మూర్తి స్వయంభువు అని చెప్పడానికి ఈ సాక్ష్యాలు చాలు.ఎప్పుడు ఎవరు కొలిచినా శ్రీవారి విగ్రహం యొక్క ఉష్ణోగ్రత 110 డిగ్రీల ఫారెన్‌హీట్ ఉంటుంది.ఎన్ని రకాల నిత్యాభిషేకాలు జరిగినప్పటికీ వెంటనే ఆరిపోతాయి,ఆవన్నీ ఆరిపోయిన వెంటనే మూర్తి 110 డిగ్రీలకి చేరుకుంటుంది!
మనం క్యూలో వెళ్తున్నప్పుడు విగ్రహం ద్వారానికి ఎదురుగా అంటే గుడి లోపల మధ్యకి ఉన్నట్టు కనబడుతుంది,కానీ వాస్తవానికి విగ్రహం గర్భగుడిలో కుడివైపు మూలన ఉంటుంది. స్వామి వెనక వైపు నుంచి ఎప్పుడూ సముద్రపు అలల హోరు వినబడుతూ ఉంటుంది.స్వామివారి వీపుని ఎన్నిసార్లు తుడిచినా సరే మళ్ళీ కొద్ది సేపట్లోనే చెమటతో తడిసినట్టు అయిపోతుంది.
స్వామివారికి ప్రతి రోజూ పూసే పచ్చ కర్పూరం చాలా ఘాటైనది,ఒక మామూలు రాతికి రోజూ దాన్ని పూస్తే కొద్ది రోజులకే పగుళ్ళు రావటం ఖాయం - మరి,ఇన్ని సంవత్సరాల నుంచి ధృవబేరుకి మాత్రం ఏమీ కావడం లేదు,ఎందుకని?
రమణ దీక్షితులు గారు చెప్పిన దాని ప్రకారం స్వామివారి ముఖం ఉదయం బాలకుని పసితనాన్ని చూపిస్తుంది,మధ్యాన్నం నడివయస్కుని గాంభీర్యాన్ని చూపిస్తుంది,సాయంకాలం శతవృద్ధుని వైరాగ్యాన్ని చూపిస్తుంది.ఆయా వేళల్లో దర్శించిన భక్తులు కూడా ఈ భేదాన్ని తెలుసుకోవచ్చు!ఊదయవేళ దర్శించినవారికి విద్యలో వృద్ధీ చిరాయువూ, మధాహ్నవేళ దర్శించినవారికి ధృఢదేహమూ ఐశ్వర్యప్రాప్తీ, సాయంవేళ దర్శించినవారికి జ్ఞానవృద్ధీ మోక్షమూ ప్రాప్తించడం అనుభవైకవేద్యమే!
అసలు కన్న కొసరు ముద్దు అన్నట్టు స్వామి వారి కన్న లడ్డు ఎక్కువ గుర్తింపు తెచ్చుకుంది - GI certificate కూడా ఉంది!పెద్ద లడ్లూ చిన్న లడ్లూ అలిపి రోజుకి రెండున్నర లక్షల లడ్లు వినియోగం అవుతున్నాయి - పురుషులందు పుణ్యపురుషుల వలె లడ్డులందు తిరపతి లడ్డు వేరయా!చిటికెడు కొకైనుకి లక్షలు తగలేసేవాళ్ళకి,గుక్కెడు పులిసిన ఫ్రెంచి మద్యానికి వేలం పాడి కోట్లు కుమ్మరించేవాళ్ళకి ఈ లడ్డుకున్న గొప్పదనం తెలియదు - కొయ్యబొమ్మల మెచ్చు కళ్ళకు కోమలుల సౌరెక్కునా అన్నట్టు.వూరికే కరకరమని నమిలి మింగదం కాదు,స్వామిని తలుచుకుంటూ తినాలి - అప్పుడే వస్తుంది అసలైన కిక్కు!
శ్రీవారి మూర్తికి గోళ్ళు పెరుగుతున్నాయనీ జుట్టు ఉందనీ అనుకుంటున్నవి పూర్తి అసత్యాలు - అలాంటివాటితో కూడుకుని ఉండటానికి అది భౌతిక అదెహం కాదు,అఖిలాందకోటి బ్రహ్మాండనాయకుడి తేజూమయరూపం!రామ్న దీక్షితులు గారు చెబుతున్న అసలైన అద్భుతం శ్రీవారి మూర్తికి పది అడుగుల దూరంలో పది అడుగుల వ్యాసం కలిగిన ప్రదేశంలో జరుగుతుందట!దేసాద్యక్షులు గానీ,పారిశ్రామికాధిపతులు గానీ,ప్రజాస్వెవారనంలో ఉన్నవారు గానీ ఆ ప్రదేశంలో నిల్బడినప్పుడు అంతకుముందు వారికి అపరిష్కృతమైన సమస్యలకి సమాధానాలు లభిస్తున్నాయట - అలా వారి వల్ల జరగాల్సిన లోకకల్యాణ యాత్రకు విఘ్నాలు తొలగుతున్నాయి!బహుసా దీనికి కారనం ఒకటి కావ్చ్చు - శ్రీవారు తిరుమలలో ఆవ్తరించాల్ని సంకల్పించిన అత్ర్వాత తొలి అడుగును ప్రస్తూతం శ్రీవారి పాదాలు అని పిలుస్తున్న చోత ఉంచారు,రెందవ అడును శిలాతొరనద్వారం దగ్గిర మోపారు అంటున్నారు,కానీ త్రిగుణ సాంఖ్యం ప్రకారం పడాల్సిన మూడవ అడుగు ఏది?బహుశా అవతరణ వేదిక మీదకై ఎక్కి ఇటువైపుకి తిరిగి దర్సనం ఇచ్చే ముందు అటువైపుకి వేసిన మూడవ అడుగును ఇక్కద మోపి ఉండవచ్చు - అందుకే ఆ పర్దేసానికి అనత్ మాహ్త్వం వచ్చింది!
దాదాపు ప్రతి భక్తుడికీ భక్తురాలికీ తిరుమల యాత్రలో కలిగే ఒక ప్రత్యేకమైన అనుభూతి యేమిటో తెలుసా!తిరుమల అనే కాదు ఏ అలయానికి వెళ్ళినా ఎదో ఒక తీరని కోరికని స్వామికి నివేదించడానికే వెళ్తాము,అవునా?కానీ మనం ఎంత పెద్ద లిస్టుతో వెళ్ళినా సరే స్వామిని చూస్తున్నప్పుడు మాత్రం ఆ కోరికల్ని చెప్పుకోవాలనే స్పృహయే ఉండదు,కదా!గోవింద నామస్మరణ వల్లనో మూర్తి సౌందర్యం వల్లనో అనుకుంటాం మనం.కానీ అది కాదు అసలు రహస్యం! స్వామి వారి చుట్టూ సిద్దులు,తాపసులు దేవతలు నిరంతరం ఆయనను అర్చిస్తూ ఆవరించి ఉంతారు - అదృశ్యలైన వారి తపఃఫలం మనకు కూడా నిరపేక్షతని అంటిస్తుంది.
ఇంకొక విశేషం ఏమిటంటే చూస్తున్నంత సేపు ఆ రూపం ఎంత ఆనందం కలిగించినా ఆ మూర్తి నుంచి చూపు మరల్చిన తర్వాత ఒక్క క్షణం సైతం ఆ రూపం మనస్సులో నిలవదు అదేమిటో,అజ్ఞానం కొద్దీ ఇహలోకపు యావలో పడిపోయామని మనల్ని మనం తిట్టుకుంటాం,కానీ అది కూడా ఒక లీలయే - మళ్ళీ మనస్సులో ఆ రూపం నిలవాలంటే మళ్ళీ ఆ మూర్తిని చూడాల్సిందే,మళ్లీ తిరుమల రావల్సిందే!
రోజుకి యాభై వేల మంది నుంచి లక్ష మంది వరకు వస్తున్నారు స్వామిని అరక్షణం చూసినా చాలుననే తపనతో - వీరిలో దశాబ్దాల ముందు నుంచి రావాలని అనుకున్న వారు,ఆరు నెలల మునదే ప్రణాళికలు వేసుకున్నవారు,అసహాయుల నుంచి దేశాద్యక్షుల వరకు సంవత్సరానికి 30 నుంచి 40 మిలియన్లు ఉంటారు!స్వామివారి వీదెశీమారకద్రవ్యం,అదే బంగారు నిల్వలు ఇప్పటికి 52 టన్నులు - తెలుపు లెక్కల ప్రకారం!స్వామివారి వార్షికాదాయం 6 బిలియన్ డాలర్లు - మరి, పన్ను కడుతున్నాడో లేదో?కట్తమంటే విజయ్ మాల్యాలాగ పారిపోడు గద!
No comments