నవవిధ భక్తిమార్గాలు

"భక్తిశ్చే నవలక్షణా" అంటూ ప్రహ్లాదుడు ఇలా చెప్పాడు. "శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాద సేవనం, అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం" వీటినే నవవిధ భక్తి మార్గాలంటారు. 

Nine Ways of Bhakthi

1.శ్రవణం అంటే శ్రద్ధగా వినడం. భగవంతుని గుణములను, నామాలను, కథలను ఎప్పుడూ వింటూ ఉండాలి.

2.కీర్తనం. ఆయన లీలలను నామాలను గానం, ప్రవచనం చేస్తూ ఉండాలి.

3.స్మరణం. ఇందులో భగవంతుని ఎప్పుడూ స్మరిస్తూ ఉండాలి.

4.పాదసేవనం. నిరంతరం ఆయన పాదాలను దర్శిస్తూ ఉండాలి.

5.అర్చనం అంటే పూజించడం.

6.వందనం అంటే నమస్కారం.

7.దాస్యం. స్వామికి దాసునిగా, భృత్యునిగా ఉండాలి.

8.సఖ్యం చేయడం అంటే స్నేహం చేయడం.

9.ఆత్మనివేదనం. తాను తనది అంతా ఉన్నది ఆయనకోసమే అని తెలుసుకుని భగవంతునికి సమర్పించాలి.

ఏ విద్యకైనా పరమ ప్రయోజనం ఇదే అంటాడు ప్రహ్లాదుడు. కలియుగంలో అర్చామూర్తికి ఒకటి తర్వాత ఒకటిగా ఈ నవవిధ సేవలు అర్పించి, తరించాలి, ఆంజనేయుడు "దాసోహం కోసలేంద్రస్య" అంటూ అధికంగా దాస్యభక్తినే ప్రదర్శిస్తాడు. కావున ప్రస్తుతం మనం భగవంతునికి శరణాగతి కావడమే శ్రేయస్కరం.

No comments