కూర్మద్వాదశి మహాత్మ్యం

వైకుంఠ ఏకాదశి మరునాడు - ద్వాదశి. దీనినే కూర్మద్వాదశి అని అంటారు. ఆ రోజు సూర్యోదయ వేళ " శ్రీ స్వామి పుష్కరిణి తీర్ధకోటి " జరుగుతుంది. వైకుంఠ ఏకాదశి నాడు ముల్లోకాల్లో ఉన్న 3కోట్ల 50 లక్షల పుణ్య తీర్ధాలు ,పుష్కరిణులు తిరుమలలోని " స్వామి పుష్కరిణి " లో దివ్య సూక్ష్మరూపంతో లీనమై వుంటాయి. అందే సర్వదేవతలు సన్నిధి చేసి ఉంటారు. కనుక ఈపర్వదినంలో శ్రీ వారి ఆలయంలో శ్రీ వారికి సుప్రభాతం , తోమాల సేవ , అర్చననివేదనాదులు యధాప్రకారం జరుగుతాయి. పిదప ఆనంద నిలయంలో ఉన్న "సుదర్శన చక్రత్తళ్వార్" పల్లకిని అధిరోహించి ఉరేగింపుగా తిరుమల తిరువీధుల్లో మహాప్రదక్షిణంగా వచ్చి శ్రీ వరాహస్వామి ఆలయ ప్రాంగణం చేరుకొంటారు. అక్కడ చక్రత్తళ్వార్ కు అభిషేకం జరిగిన తర్వాత పుష్కరిణిలో పవిత్ర స్నానం చేయిస్తారు. ఇలా చక్ర స్నానం జరిగే సమయంలో అసంఖ్యాక భక్తులు కూడా పుష్కరిణి లో మునిగి పవిత్ర స్నానం చేస్తారు. పిదప చక్రత్తళ్వార్ కు వస్రాలంకారం , నివేదన హారతులు ఘనంగా నిర్వహిస్తారు. అటు నుండి చక్రత్తళ్వార్ వారు (సుదర్శన భగవానులు) బయలు దేరి ,ప్రధక్షిణంగా వేంచేసి , శ్రీ వారి ఆలయాన్నిప్రవేశిస్తారు.

తిరుమలలో స్వామి పుష్కరిణిలో సంవత్సరంలో నాల్గుమార్లు చక్ర స్నానం జరుగుతుంది.

 1. భాద్రపద శుద్ద చతుర్దశి - అనంత పద్మనాభ వ్రతం నాడు
 2. 10 రోజులు జరిగే బ్రహ్మోత్సవాలలో చివరి రోజు
 3. వైకుంఠ ఏకాదశి నాడు - ద్వాదశి నాటి ఉదయం
🌷

No comments