శ్రీవారు పూజించిన దైవం
వేదాలే శిలలై వెలసిన కొండ తిరుమలగిరి. భక్తకోటి ముక్తకంఠంతో ఎలుగెత్తిచాటే కొండ. ఎన్నో కష్టనష్టాలకోర్చి, గంటలు, రోజుల తరబడి క్యూలైన్లలో ఉండి క్షణకాలం పాటు తిరుమలేశుని దర్శనంతో భక్తులంతా పులకించిపోతారు. అలాంటి తిరుమలేశుడు కోట్లాది మంది భక్తుల కన్నుల పంట.
Ahobilam Narasimha Swamy |
సాధారణంగా ఏ కుటుంబానికైనా ఓ కులదైవముంటాడు. తమ ఇంట జరిగే శుభకార్యంలోనైనా ఆ స్వామిని పూజించడం ఆనవాయితీ. ముఖ్యంగా.. వివాహ సమయంలో తమ ఇష్టదైవానికి నమస్కరించి మిగిలిన ఘట్టం పూర్తి చేస్తారు. మరి తిరుమలేశుడు పద్మావతిదేవిని వివాహం చేసుకునే సమయంలో పూజించిన భగవత్ స్వరూపం ఎవరో తెలుసా? సాక్షాత్ అహోబిలం నృసింహుడే. ఇప్పటికీ దిగువ అహోబిలంలో శ్రీనివాసుని కళ్యాణాన్ని కన్నులపండుగగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఆ స్వామి పూజ తర్వాతే శ్రీనివాసుడు పద్మావతి దేవిని పరిణయమాడినట్టు పురాణాలు చెపుతున్నాయి.
తిరుమల వెళ్లినపుడు గమనిస్తే తిరుమలేశుని హుండీకి ఎదురుగా నృసింహ స్వామి ఆలయం కనిపిస్తుంది. అదేవిధంగా తిరుమల నడకదారిలోనూ అనేక నృసింహ ఆలయాలు మనకు కనిపిస్తాయి. ఇక ఉత్తర మాఢ వీధుల్లో అహోబిల మఠాన్ని మనం గమనించవచ్చు. ఇలా తిరుమలకు, అహోబిలానికి మధ్య ఆధ్యాత్మిక వారధి కనిపిస్తుంది. ఇంకా చెప్పాలంటే తిరుమల నిజానికి వరాహక్షేత్రం. వరాహస్వామి, తిరుమలేశునికి చోటు ఇచ్చారని చెప్పొచ్చు.
రామావతారంలో సాక్షాత్ శ్రీరాముడే రామేశ్వర లింగాన్ని ప్రతిష్టించాడు. అదేవిధంగా తిరుమలేశుడు సాక్షాత్ విష్ణు స్వరూపమే అయినప్పటికీ, సంప్రదాయాలను గౌరవిస్తూ మరో విష్ణుస్వరూపమైన నృసింహస్వామిని పూజించాడని చెప్పడంలో ఏ విధమైన సందేహం అవసరం లేదు
తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్ళినప్పుడు మనం ముందుగా వెండివాకిలి దాటి తరువాత బంగారు వాకిలి గుండా వెళ్లి శ్రీవారిని దర్శించుకుంటూవుంటాం. ఈ వెండివాకిలి గోపురం యొక్క ప్రాకారానికి,బయట మహాద్వార ప్రాకారానికి మధ్యగల సుమారు 30అడుగులు వున్న ప్రదక్షిణా మార్గాన్ని సంపెంగ ప్రదక్షిణం అనిఅంటారు.ఆలయంలో మనం ప్రవేశించిన మొదటి ప్రదక్షిణామార్గమే ఈ సంపంగి ప్రదక్షిణ మార్గం.
చాలా కాలం క్రిందట ఈ సంపెంగిఆవరణంలోని మహాద్వారానికి దగ్గరగా ఒక పెద్ద చింతచెట్టు వుండేదట. దానికి కొమ్మలు, రెమ్మలు శాఖోపశాఖలుగా పెరిగి అతి విశాలంగా వ్యాపించి ఆ చెట్టునీడ ఎటూతిరగక ఆ వృక్షం మూలంలోనే స్థిరంగా వుండేది.
అందువల్ల అది నీడతిరుగని చింత చెట్టుగా ప్రసిద్ధిచెందింది. అంతమాత్రమే కాదు అది నిద్రపోని చింతచెట్టుగా కూడా పేర్కొనబడినది. దాని శాఖలు కొన్ని చిగురించగా, మరి కొన్ని శాఖలు పుష్పించగా, ఇంకొన్ని శాఖలు కాయలు, పండ్లు కాస్తుండేవి.
ఇలా అన్ని కాలాలు విశ్రాంతి ఎరుగక ఆ చెట్టు నిరంతరం చిగురించటం, పుష్పించటం, ఫలించటం వల్ల అది నిద్రపోని చెంత చెట్టుగా పిలవబడుతుంది. ఈ చెట్టు క్రింద పుట్టలో శ్రీనివాసుడు కొంతకాలం దాగివున్నాడు. ఆ తరువాత స్వామివారు విగ్రహ మూర్తిగా స్వయంభూ యై వెలసి పుట్టలో నిక్షిప్తమై వున్నాడు.ఆ నీడ తిరుగని, నిద్రే ఎరుగని చింత చెట్టు సాక్షాత్తూ వాసుదేవుడననీ, ఆదిశేషుడని, ఆ చెట్టుక్రింద పుట్ట దేవకీదేవి అని పురాణాలు పేర్కొంటున్నాయి.
అట్టి సమయంలో మొట్టమొదట గోపీ నాథుడనే వైఖానసుడు ఈ క్షేత్రానికి వచ్చి పుష్కరిణీ దక్షిణతీరంలో చింతచెట్టు క్రింద పుట్టలో వున్న వేంకటేశ్వరుని దర్శించి పుట్టలోని ఆ స్వామి వారి పుష్కరిణీ పశ్చిమతీరంలో అంటే ప్రస్తుతం శ్రీవారు వున్న చోటు ప్రతిష్టించి ఆనాటి నుండి అక్కడే ఉంటూ ఆ స్వామికి అర్చనాదిపూజాదిక్రమములు చేస్తూ వున్నాడు.
ఆ తరువాత రంగదాసుడు అనే భక్తుడు కూడా ఆ ప్రాంతానికి వచ్చి ఒక బావిత్రవ్వి సంపెంగి, చేమంతి మున్నగు చెట్లను పెంచి శ్రీ స్వామి వారి పూజకవసరమైన పూలను, పండ్లను సమర్పిస్తూ అర్చకుడైన గోపీనాధుడుకి సహాయంగా ఉండేవాడు.
ఈ #రంగాదాసే ఈ జన్మలో #తొండమాన్ రాజుగా జన్మించి శ్రీనివాస స్వామికి గోపురప్రాకారాదులు నిర్మించాడట. ఆ సందర్భంలో తనకి ప్రీతిపాత్రమైన ఆ చింతచెట్టును ఆ చింత చెట్టుకు కొద్ది దూరంలోనే వుంటూ లక్ష్మీదేవికి ఆవాసస్థానమై,అత్యంత ప్రియమై ఎల్లప్పుడూ పుష్పించే చంపకవృక్షాన్ని మాత్రం రక్షించి,ఇక మిగిలిన చెట్లను తొలగించి ఆలయప్రాకారాదులు నిర్మించవలసిందన్న శ్రీ వేంకటేశ్వరస్వామి ఆదేశాలని తొండమానుడు నిర్వర్తించాడని వేంకటాచలమహాత్య గ్రంధం తెలుపుతుంది.
పిదప 15వ శతాబ్దంలో #తాళ్ళపాక #అన్నమాచార్యులు కూడా తొలిసారిగా వేంకటాచల యాత్ర చేసిన సందర్భంలో నీడ తిరుగని చింత చెట్టును దర్శించి సేవించినట్లుగా అన్నమాచార్య జీవిత చరిత్ర వలన తెలుస్తుంది.
పిదప 15వ శతాబ్దంలో #తాళ్ళపాక #అన్నమాచార్యులు కూడా తొలిసారిగా వేంకటాచల యాత్ర చేసిన సందర్భంలో నీడ తిరుగని చింత చెట్టును దర్శించి సేవించినట్లుగా అన్నమాచార్య జీవిత చరిత్ర వలన తెలుస్తుంది.
No comments